News25th Jan 11:13 AMSunil Byrisetty1 min read

మహిళలకు నెలకు రూ 1500..!?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వ

మహిళలకు నెలకు రూ 1500..!?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశ అజెండా.. పని దినాల పైన నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావటంతో 14వ తేదీ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తో పాటుగా ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. 18 నుంచి 21 పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ సమావేశాలపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
Andhra Pradesh Budget
AP Assembly Sessions
2025-26 Budget
AP Politics
Governor Address
Budget Meetings
వ్యవసాయ బడ్జెట్
ఇరిగేషన్ బడ్జెట్
ఏపీ కేబినెట్
సంక్షేమ పథకాలు
Scroll for the next article