News18th Aug 03:26 PMSunil Byrisetty1 min read

రూరల్ లో 34 శాతం.. అర్బన్లో 33.1 శాతం,

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34 రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలో బీసీలకు 33.1 శాతం రిజర్వే

రూరల్ లో 34  శాతం.. అర్బన్లో 33.1 శాతం,
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34 రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలో బీసీలకు 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్థికసంఘం నిధులు రూ.16,500కోట్లు మురిగిపోకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మేయర్ల ఎన్నికకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాత పద్దతిలో ఒక డిప్యూటీ మేయర్‍కే పరిమితం కావాలని నిర్ణయించింది. దాదాపు 55కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గం భేటీ జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై కేబినెట్లో చర్చ జరిపారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Cabinet
BC Reservations
34 Percent Reservation
33.1 Percent Reservation
Local Body Elections
Rural Reservations
మున్సిపల్ ఎన్నికలు
మేయర్ ఎన్నికలు
జాబ్ క్యాలెండర్
10060 ఉద్యోగాలు
మంత్రివర్గ సమావేశం
Scroll for the next article