News29th Dec 02:51 PMSunil Byrisetty1 min read

జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో నియోజకవర్గాల మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, రాయచోటిని మదనపల్లె కేంద్రంగా ఏర్ప

జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో నియోజకవర్గాల మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, రాయచోటిని మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాలో కలపడానికి ఆమోదం తెలిపింది. రాజంపేటను కడప జిల్లాలో కలపాలని, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని కూడా నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మార్పులతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమావేశంలో గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
AP Cabinet
District Reorganisation
New Districts
Annamayya District
Rayachoti
Madanapalle District
Rajampet
Kadapa District
Railway Kodur
జిల్లాల సంఖ్య 28
గెజిట్ నోటిఫికేషన్
గూడూరు
నెల్లూరు జిల్లా
రెవెన్యూ డివిజన్లు
Scroll for the next article