News9th Jan 03:20 PMSunil Byrisetty1 min read

ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా “క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం”

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” క

ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా “క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం”
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” కు మంత్రి మండలి ఆమోదం లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCలు) స్థాపించబడతాయని తెలిపారు. ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్, అగ్రి-బేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కేంద్రాలు పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, సుమారు 1,840 MSME యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 7,500కు పైగా ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలుగనున్నట్లు మంత్రి తెలిపారు.
Andhra Pradesh
MSMEs
Micro Small and Medium Enterprises
Andhra Pradesh Cluster Development Program
AP-CDP
Minister Kondapalli Srinivas
పరిశ్రమల అభివృద్ధి
ఉపాధి కల్పన
యువతకు ఉద్యోగాలు
Scroll for the next article