Jobs23rd Jul 04:01 PMSunil Byrisetty1 min read
మరోసారి కొలువుల జాతర!
ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కొలువుల భర్తీ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర
ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కొలువుల భర్తీ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు శాఖల్లో మొత్తం 3,168 ప్రభుత్వ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వివిధ శాఖల్లో నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది గొప్ప శుభవార్త కానుంది.