News10th Jul 03:30 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియా న్యూసెన్స్‌పై టాస్క్ ఫోర్స్!
మంత్రివర్గ అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిపై చర్యలకు ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని
మంత్రివర్గ అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిపై చర్యలకు ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సీఎం ఆదేశించారు. అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని సీఎం సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననంపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేతలను కించపరుస్తూ చేసే వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.