Politics9th Jul 11:52 AMSunil Byrisetty1 min read
మంత్రి పదవి ఎవరికి? పల్లా-గంటా మధ్య పోటీ?
ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. విస్తరణలో భాగంగా విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్ల
ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. విస్తరణలో భాగంగా విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పల్లాకు అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పల్లా నిబద్ధత, వివాదరహిత వ్యక్తిత్వం, పార్టీ అధిష్ఠానంతో ఉన్న సానుకూల సంబంధాలు ఆయనకు కలిసి వస్తాయని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడైన గంటా శ్రీనివాసరావుకు మంత్రిగా పనిచేసిన విస్తృత అనుభవం ఉండటంతో ఆయనకూ బలమైన అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా రాజకీయాల్లో సమన్వయం, పార్టీ బలోపేతానికి గంటా సేవలు ఉపయోగపడతాయని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. దీంతో విశాఖ కోటాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.