News6th Aug 08:24 AMSunil Byrisetty1 min read

ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్

అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. అలాగే మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటిక

ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్
అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. అలాగే మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే స్త్రీ శక్తిగా పేరు ప్రకటించిన నేపథ్యంలో విధివిధానాలను వెల్లడించనున్నారు. నాలా చట్ట సవరణకు సంబంధించి ఆర్డినెన్స్‌పైనా ప్రకటన చేయనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొత్త బార్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చ నిర్వహించనున్నారు. వచ్చే నెల 1 నుంచి ఏపీలో కొత్త బార్‌ పాలసీ అమలులోకి రానుంది. సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపైనా చర్చ జరుపనున్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆమోదం తెలపనున్నారు. కఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలపై సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. పలుసంస్థలకు భూకేటాయింపులపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.
AP Cabinet Meeting
Free Bus Travel For Women
Sthree Shakti Scheme
New Bar Policy AP
Chandrababu Singapore Tour
NALA Act Amendment
LRS Decision
ఏపీ కేబినెట్
ఉచిత బస్సు ప్రయాణం
Scroll for the next article