News10th Nov 11:49 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 70 అజెండా అంశాలతో కేబినెట్ సుదీర్ఘంగా సాగనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి, నైబర్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 70 అజెండా అంశాలతో కేబినెట్ సుదీర్ఘంగా సాగనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి, నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ 2025-30కి ఆమోదం తెలపనుంది. ఐటీ శాఖకు సంబంధించిన 10కి పైగా అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. విశాఖ, తిరుపతి, కుప్పం, కర్నూలు ప్రాంతాల్లో సంస్థలకు భూకేటాయింపుపై నిర్ణయం తీసుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమల ఏర్పాటుకు భూకేటాయింపుపై నిర్ణయం.. డ్రోన్ సిటీ కోసం భూ కేటాయింపు విధానానికి ఆమోదం తెలపనుంది. 12వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో ఆమోదం తెలిపిన పెట్టుబడులపై చర్చిస్తోంది. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీపీఎఫ్‌సీఎల్ నుంచి రుణంపై చర్చ జరపనుంది. అలాగే అసైన్డ్ భూముల చట్టానికి ప్రతిపాదించిన పలు సవరణలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.