News20th May 02:58 PMSunil Byrisetty1 min read
ఏపీ క్యాబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ
ఏపీ క్యాబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెల
ఏపీ క్యాబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని పేర్కొన్నారు.
మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు.
ఈ నేపథ్యంలో రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు