News9th Oct 04:10 PMSunil Byrisetty1 min read

రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ భేటీ

శుక్రవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెల‌ప‌నుంది. ర

రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ భేటీ
శుక్రవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెల‌ప‌నుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పనుంది. రేప‌టి క్యాబినెట్ లో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించ‌నున్న‌ గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది.
Andhra Pradesh
AP Cabinet Meeting
Chandrababu Naidu
Investments
Vizag
Raiden Infotech
Data Center
Amaravati
Raj Bhavan
క్యాబినెట్‌భేటీ
చంద్రబాబు
పెట్టుబడులు
Scroll for the next article