News23rd Sep 12:11 PMSunil Byrisetty1 min read

కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు

కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నారు. ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ సంబంధిత అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించింది. ఐటీ రంగంలో సుమారు రూ. 526 కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. రాష్ట్రంలోని వర్షాభావం, కరువు పరిస్థితులు, తుపాను ప్రభావం మరియు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు.
Scroll for the next article