Politics11th Mar 10:11 AMSunil Byrisetty1 min read
రాజధాని భూములపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
రాజధానిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కేటాయింపులు రద్దునకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసిం
రాజధానిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
వివిధ కారణాలతో కేటాయింపులు రద్దునకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది...
అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సచివాలయంలో జరిగింది.
మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ తో పాటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు.
2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు.
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో మూడు ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసింది.
అప్పట్లోనే 43 వేల కోట్లకు విలువైన పనులకు టెండర్లు పిలిచి 9 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు.
అయితే వైసీపీ కక్ష సాధింపుతో అమరావతిపై మూడు ముక్కలాట ఆడింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి 8 నెలలు పట్టింది. రూ. 48 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేశాం.
సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో ఆమోదం పొందగానే ఆయా సంస్థలతో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుంది. ఆ వెంటనే రెండు మూడు రోజుల్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ.