News20th Sep 11:44 AMSunil Byrisetty1 min read
నైతిక విలువలతో దేశంలోనే నెం.1గా ఏపీ!
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాకినాడలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి క
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాకినాడలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో కలిసి 'భారతీయం' కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం...అందుకే విద్యాశాఖ ఎంచుకున్నానని తెలిపారు.
సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదామని పిలుపునిచ్చారు. దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. త్యాగధనులే మన మార్గదర్శకులు.. వారి బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. విలువలతో ఎదగండి.. తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవండని విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.