News21st Aug 09:48 AMSunil Byrisetty1 min read

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబ

ఉద్యోగుల సమస్యల  పరిష్కారానికి కృషి
రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెండిగ్ డిఏలు, పిఆర్సి బకాయిలు, ఆర్జిత సెలవుల నగదు చెల్లింపు బకాయిలు తదితర అంశాలను సిఎస్ దృష్టికి తెచ్చారు. సిఎస్ మాట్లాడుతు ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి జరిగిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపిన అన్ని అంశాలను నమోదు చేయడం జరిగిందని, వాటన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పారు. నాయకులు వివిధ ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలను సిఎస్ విజయానంద్ దృష్టికి తెచ్చారు.
Andhra Pradesh
Government Employees
K Vijayanand
Chandrababu Naidu
Joint Staff Council
Pending DAs
PRC Arrears
ఆర్జిత సెలవులు
ఉద్యోగుల సంక్షేమం
Scroll for the next article