News22nd Oct 04:13 PMSunil Byrisetty1 min read
సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం మరో 6 మాసాలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు పొడిగించింది.ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది,ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు పొడిగించింది.ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది,ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ విభాగం(డిఓపిటి)ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం సిఎస్ పదవీ కాలాన్నిమరోసారి ఆరు మాసాలకు అనగా 2027 మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర సాధారణ పరిపాలన(పొలిటికల్)శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జి.సాయి ప్రసాద్ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తుండగా ఇప్పటికే గత జూన్ 1 నుంచి నవంబరు 30 వరకూ 6 మాసాలు ఆయన పదవీ కాలాన్ని పొడిగించగా వచ్చే నెల30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సిఎస్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న కేంద్ర ప్రభుత్వానికి డిఓ లేఖ వ్రాయగా కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది.