News27th Jul 10:40 AMSunil Byrisetty1 min read

తిరుమల శ్రీవారి సేవలో సీఎస్

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంక

తిరుమల శ్రీవారి సేవలో సీఎస్
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి ప్రధాన కార్యదర్శికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వారు చర్చించారు.
Andhra Pradesh news
K Vijayanand
AP Chief Secretary
Tirumala Darshan
Sri venkateswara swamy
Brahmotsavam Preparations
తిరుమల శ్రీవారి సేవలో సీఎస్
Scroll for the next article