News22nd Nov 05:42 PMSunil Byrisetty1 min read
సీఎస్ విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు సీఎస్ అవకాశం కల్పించనుంది. 2026 మే నెలాఖరు వరకూ సాయిప్రసాద్ కు సర్వీసు ఉంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీఎస్ గా ఆయన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.