News10th Nov 04:46 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ దరఖాస్తులు, అధికారిక రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి
ప్రభుత్వ శాఖల దరఖాస్తులు, అధికారిక రికార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో చట్టపరంగా తప్పనిసరి కాని సందర్భాల్లో తండ్రి పేరు నమోదు చేయాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్
ప్రభుత్వ శాఖల దరఖాస్తులు, అధికారిక రికార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో చట్టపరంగా తప్పనిసరి కాని సందర్భాల్లో తండ్రి పేరు నమోదు చేయాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) పిలుపునిచ్చింది. తండ్రి వివరాలు లేవనే కారణంతో ఏ చిన్నారికీ విద్య, గుర్తింపు పత్రాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సేవలు అందకుండా చేయకూడదని స్పష్టం చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో మంగళవారం చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన 'తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించడం' అనే అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న AP SCPCR చైర్మన్ వేటుకూరి ఏ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ... ప్రతి చిన్నారికి స్వతంత్ర హక్కులు, గౌరవం, గుర్తింపు ఉంటాయని, తల్లిదండ్రుల వైవాహిక స్థితి, కుటుంబ పరిస్థితులు, సామాజిక నేపథ్యం ఆధారంగా పిల్లల భవిష్యత్తు నిర్ణయించరాదని పేర్కొన్నారు. పిల్లల గౌరవం, సమానత్వం, వ్యక్తిగత గుర్తింపు, ప్రాథమిక హక్కులకు ప్రభుత్వ పరిపాలనా విధానాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కన్వెన్షన్ (UNCRC) లోని ఆర్టికల్స్ 2, 3, 7, 8, 12, 16, 28లను ప్రస్తావిస్తూ... వివక్షకు తావులేకుండా చూడటం, బాలల సంక్షేమానికి ప్రాధాన్యత, గుర్తింపు హక్కు, అభిప్రాయ వ్యక్తీకరణ, వ్యక్తిగత గోప్యత, విద్యా హక్కులను ఈ నిబంధనలు పరిరక్షిస్తున్నాయన్నారు.