Film News13th Apr 02:57 PMSunil Byrisetty1 min read
సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి ఆంధ్రాకు..!
హైదరాబాదు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావాలని కోరుతున్నామని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. వారాహి ఆర్ట్స్ శక్తి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర
హైదరాబాదు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావాలని కోరుతున్నామని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
వారాహి ఆర్ట్స్ శక్తి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెస్ట్రన్ లవ్ చిత్రానికి ఆయన ముహూర్తపు క్లాప్ కొట్టి మాట్లాడారు.
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆంధ్ర రాష్ట్రంలో సినీ నిర్మాణం చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీ వీర మహిళ రావి సౌజన్య వెస్ట్రన్ లవ్ చిత్రాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు.
రాష్ట్రంలో సినిమాలు నిర్మించే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటుకు రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో చిత్రాలు నిర్మించే వారికి కావలసిన మౌలిక సదుపాయాలు అందించడంతోపాటు ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తామని దుర్గేష్ పేర్కొన్నారు