Farmers15th Sep 03:08 PMSunil Byrisetty1 min read
ఏపీ రైతులకు గుడ్ న్యూస్..
ఏపీలో వ్యవసాయంలో యూరియా వాడకం తగ్గించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు రూ. 800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్
ఏపీలో వ్యవసాయంలో యూరియా వాడకం తగ్గించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు రూ. 800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక రైతు తన పంటకు ఈ ఏడాది నాలుగు బస్తాల యూరియా వినియోగించి, వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే ప్రతి బస్తాకు రూ.800 చొప్పున రూ.1600 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖపై కలెక్టర్లతో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో యూరియా వాడకం తగ్గించడంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.