News16th Jul 01:00 PMSunil Byrisetty1 min read

చివరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉంది

చివరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కరవుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమను ఆదుకోవడానికి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు కేంద్ర హోం శాఖ మ

చివరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉంది
చివరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కరవుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమను ఆదుకోవడానికి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు. ఎగువ, దిగువ రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో మిగులు జలాలు ఉంటాయని ఆయనతో చెప్పారు. నదీ పరివాహక ప్రాంతంలో చిట్టచివర ఉన్న APకి నీటిని వినియోగించుకునే హక్కు ఉందని షాతో వెల్లడించారు. సముద్రంలోకి వెళ్లే ఈ జలాల నుంచి 200 TMCలతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. బనకచర్లకు అనుమతినివ్వాలని కోరారు.
Andhra Pradesh news
Union Home Minister Amit Shah
Telangana
cm revanth reddy
banakacherla project
Godavari
Rayalaseema
200 TMCలతో రాయలసీమ
Scroll for the next article