News30th Dec 05:48 PMSunil Byrisetty1 min read

పెన్షన్ల పండుగకు సీఎం దూరం

పేదల సేవలో పేరుతో ప్రతి నెలా పెన్షన్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు తొలిసారి గైర్హాజరవుతున్నారు. ఆయన ఈ సమయంలో విదేశాలలో ఉండనున్నారు దాంతో బాబు లేకుండానే మొదటిసారి ఏపీ

పెన్షన్ల పండుగకు సీఎం దూరం
పేదల సేవలో పేరుతో ప్రతి నెలా పెన్షన్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు తొలిసారి గైర్హాజరవుతున్నారు. ఆయన ఈ సమయంలో విదేశాలలో ఉండనున్నారు దాంతో బాబు లేకుండానే మొదటిసారి ఏపీలో సామాజిక పెన్షన్ పంపిణీ సాగనుంది. చంద్రబాబు 2024 జూన్ 12న నాలుగవ సారి ఏపీకి సీఎం అయిన తరువాత జూలై 1న ఆయన జిల్లాలకు వెళ్ళి పేదల ఇంటి వద్ద తానే స్వయంగా వారికి పెన్షన్ పంపిణీ చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. ప్రజా వేదిక మీద నుంచి ప్రసంగం చేశారు. అది గత 18 నెలలుగా అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి జనవరి 4న రాష్ట్రానికి రానున్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Social Pensions
Pension Distribution
Chief Minister
ప్రజా సంక్షేమం
విదేశీ పర్యటన
Scroll for the next article