News25th Mar 04:35 PMSunil Byrisetty1 min read

ప్రజలే ఫస్ట్.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

మన విధానం ప్రజలే ఫస్ట్ అనేది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలుు ఉండాలన్నారు. కలెక్టర్ల సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర

ప్రజలే ఫస్ట్.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు క్లారిటీ!
మన విధానం ప్రజలే ఫస్ట్ అనేది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలుు ఉండాలన్నారు. కలెక్టర్ల సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రజల ఆమోదం పొందేలా పాలన ఉండాలని సూచించారు. కూటమికి 93 శాతం స్ట్రైక్‌రేట్ వచ్చిందంటే ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్ని ఆశలు పెట్టుకుని ఇచ్చారో ఆలోచించాలని పేర్కొన్నారు. అందుకనుగుణంగా ప్రజలే ఫస్ట్ అన్న విధానంలో పని చేయాలన్నారు. జిల్లాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని, మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళుతున్నామని చెప్పారు. పర్యాటకంలో 20 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలని, పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలని నిర్దేశించారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తామని, శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని, గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
CM Chandrababu
Collectors
Andhra Pradesh
Scroll for the next article