News7th Jul 12:22 PMSunil Byrisetty1 min read

పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృ

పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగింది. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ఈ జనరల్ బాడీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పీ-4 పథకం సమర్థవంతంగా అమలుకు రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటీవ్ కమిటీ, అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గం స్థాయిలో పీ4 ఛాప్టర్లు ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కమిటీల్లో స్పర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ సహా ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. పీ4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
Andhra Pradesh news
Cm chandra babu
Swarnandhra P4
P4 Foundation
Bapatla District
Welfare schemes
Golden families
స్వర్ణాంధ్ర పీ -4పై సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు
Scroll for the next article