News9th Jun 05:04 PMSunil Byrisetty1 min read

మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ.. ప్రపం

మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అని అన్నారు. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చాంధ్రను అమలు చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్‌తో టెక్నలజీ బాగా పెరిగిందన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయని తెలిపారు. రెండు నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సప్‌లో ఉంటాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్‌ కాదు.. గేమ్‌ ఛేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని.. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు.
Andhra Pradesh news
cm chandra babu
technology
Whatsapp governance
online services
రెండు నెలల్లో సేవలన్నీ వాట్సప్లో
Scroll for the next article