News14th Apr 12:19 PMSunil Byrisetty1 min read

అంబేద్కర్‌కు సీఎం చంద్రబాబు నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. చంద్రబాబు

అంబేద్కర్‌కు సీఎం చంద్రబాబు నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. చంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్‌ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్‌ దేశసేవను స్మరించుకుందామన్నారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని పేర్కొన్నారు. అలాగే ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు.
CM Chandrababu Naidu
Tribute To Dr BR Ambedkar
చంద్రబాబు ఘన నివాళులర్పించారు
ఉండవల్లి
Scroll for the next article