Locations27th Mar 10:38 AMSunil Byrisetty1 min read

విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్‌.. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు

విజయవాడలో రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఇఫ్తార్ నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో రా

విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్‌.. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు
విజయవాడలో రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఇఫ్తార్ నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని మంత్రి ఫరూక్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి ఇఫ్తార్ ఏర్పాట్లు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లకు జిల్లాలకు నిధులను కేటాయించి విడుదల చేయడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ముస్లిం మైనార్టీల కు సంబంధించి గత ప్రభుత్వం నిలిపివేసిన ఇమాములు, మౌజన్ల గౌరవ వేతనంను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించి కూడా పాస్టర్ల వేతనాలకు ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్‌తో పాటు అన్ని జిల్లాల్లో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఫరూక్ సూచించారు.
Vijayawada
Chandrababu
Iftar Event
రంజాన్ మాసం
Scroll for the next article