News7th Jun 12:30 PMSunil Byrisetty1 min read

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ బుద్ధిని

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోందన్నారు. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో శుభాకాంక్షలు పోస్ట్ చేశారు.
Andhra Pradesh news
cm Chandra Babu
Bakrid
muslims
eid
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఈద్ ముబారక్
Scroll for the next article