News30th Aug 02:58 PMSunil Byrisetty1 min read
కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషించ
చిత్తూరు జిల్లా కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషించారు. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా... ఫ్రీ బస్సులో వెళ్తున్నామని మహిళలు చెప్పారు. చక్కటి సదుపాయాన్ని కల్పించారని.. తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంకు వివరించారు. హంద్రీ-నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయన్నారు. ప్రయాణికులతో కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని... చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు చెప్పారు.