News1st Jul 09:12 AMSunil Byrisetty1 min read
ఇంటింటికీ టీడీపీ.. చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని సీఎం చంద్రబాబు జూలై 2న ప్రారంభించబోతున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు షెడ్యూల్, టైమ్ కూడా ఖరారు చేశారు. జూలై 2న సీఎం చంద్రబాబు కుప్పంలోని శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో ఉదయం 8 గంటల నుంచి డోర్ టూ డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటారు. చంద్రబాబు స్వయంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు కుప్పంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తారు.