News30th Jul 03:44 PMSunil Byrisetty1 min read

ఆగస్టు 1న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగ

ఆగస్టు 1న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 2,3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తద్వారా అక్కడున్న ఔత్సాహికపెట్టుబడిదారులను,పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏపీలో గతంలో సీఎం చంద్రబాబు హయాంలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ప్రతి ఏటా జరిగేదని గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంబించలేదన్నారు.
Andhra Pradesh news
Gandikota Tourism Project
YSR Kadapa
CM Foundation Stone
SASCI Scheme
Kandula Durgesh
Udaipur Exhibition
గండికోట పర్యాటక ప్రాజెక్టు
వైఎస్సార్ కడప జిల్లా
సీఎం శంకుస్థాపన
సాస్కి పథకం
Scroll for the next article