Politics16th Nov 12:42 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేల నెలవారి టైం టేబుల్ రిలీజ్ చేసిన సీఎం
ఏపీలో ఎమ్మెల్యేలకు నెలవారీ కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి. 5వ తేదీన ప్రభుత్వ పాఠశాల సందర్శన నిర్వహించ
ఏపీలో ఎమ్మెల్యేలకు నెలవారీ కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి. 5వ తేదీన ప్రభుత్వ పాఠశాల సందర్శన నిర్వహించాలి. 10వ తేదీన అన్న కాంటీన్లో భోజనం చేయాలి. 15న ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన చేపట్టాలి. 20న CMRF/TDP కార్యకర్తల భీమా పంపిణీ నిర్వహించాలి. 25న MRO లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ చేపట్టాలని షెడ్యూల్లో సీఎం స్పష్టం చేశారు.