Politics27th May 08:35 AMSunil Byrisetty1 min read

వెన్నుపోటు దినంపై వైసీపీ సమావేశం!

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఐదు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. గుంటూరు, ఎన్టీఆర్‌, క్రిష్ణా, బాపట్ల,

వెన్నుపోటు దినంపై వైసీపీ సమావేశం!
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఐదు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. గుంటూరు, ఎన్టీఆర్‌, క్రిష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, పార్లమెంట్‌ అబ్జర్వర్స్‌, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గ్రామస్ధాయి వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని తీర్మానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉండాలన్నారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టడం, కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పించడంలో నేతలు పాల్గొనాలని కోరారు.
Andhra Pradesh
AP Politics
ysjagan
chandrababu
pawankalyan
Backlash Day On June 4
జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం
ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టడం
Scroll for the next article