News23rd Jul 04:51 PMSunil Byrisetty1 min read

పారదర్శకంగా లిటిగేషన్ పాలసీ

పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాఖల పరిధిలో కోర్టుల్లోకి కేసులను నిరంతర పర్యవేక్షణకు ఓ ప్రత్యేకమైన ప

పారదర్శకంగా లిటిగేషన్ పాలసీ
పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాఖల పరిధిలో కోర్టుల్లోకి కేసులను నిరంతర పర్యవేక్షణకు ఓ ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు ఎండీ ఫరుక్, సత్యకుమార్ లతో కలిసి మనోహర్ పాలసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్, అహ్మదాబాద్ లో పర్యటించి, ఆ రాష్ట్ర లిటిగేషన్ విధానాన్ని పరిశీలించిన అంశాలను కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచారు. గుజరాత్ ఎన్ఐసీ తరహా పోర్టల్ ను రాష్ట్రంలోనూ అభివృద్ధి చేసి, ప్రత్యేక మానటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి శాఖ పరిధిలోని కేసులను సత్వరంగా పరిష్కరించేలా ప్రతి శాఖకు ప్రత్యేక లైసనింగ్ అధికారితో పాటు, వారిని పర్యవేక్షించే బాధ్యతను నోడల్ అధికారికి అప్పగిస్తామని తెలిపారు.
Andhra Pradesh
Nadendla Manohar
State Litigation Policy
Litigation Management
Cabinet Sub Committee
జవాబుదారీతనం
కోర్టు కేసులు
మానిటరింగ్ సెల్
నోడల్ అధికారి
గుజరాత్ మోడల్
Scroll for the next article