News18th Jul 03:12 PMSunil Byrisetty1 min read

ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ

ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ

ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ
ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఈ సంధర్బంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైనా సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరొకసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది.
Andhra Pradesh news
Velagapudi Secretariat
Ministerial Committee
Rule of Reservation
Gummadi Sandhyarani
Nadendla Manohar
ఎస్సీ
ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు
Scroll for the next article