Politics11th Sep 11:41 AMSunil Byrisetty1 min read
లోకల్ బాడీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కమిటీ
లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు ప్రారంభించారు. 10 మందితో కూడిన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. CWC సభ్యులు రఘు
లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు ప్రారంభించారు. 10 మందితో కూడిన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. CWC సభ్యులు రఘువీరా రెడ్డి చైర్మన్ గా మానిటరింగ్ కమిటీని నియమించారు. కమిటీ కన్వీనర్ గా మాజీ కేంద్రమంత్రి, APCC వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలంను నియమించారు. మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, మాజీ రాజ్యసభ ఎంపీ, ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, కమిటీ సభ్యులుగా AICC సభ్యులు సిరివెళ్ళ ప్రసాద్.. గారె ఉషా నాయుడు వ్యవహరిస్తారు. ఎన్నికలకు పీసీసీ కో ఆర్డినేషన్, మరియు సోషల్ మీడియా ఇంచార్జిగా అధికార ప్రతినిధి, నెల్లూరు DCC కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొనేలా మానిటరింగ్ కమిటీకి షర్మిల దిశా నిర్దేశం చేశారు.