National23rd Jul 02:57 PMSunil Byrisetty1 min read
రాహుల్ గాంధీ అక్రమ నిర్బంధం.. ఏపీ గవర్నర్‌కు కాంగ్రెస్ వినతి
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్‌ను, అలాగే లోక్
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్‌ను, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా నిర్బంధించిన ఘటనను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పేపర్ లీక్‌ల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 60 వేల మంది నీట్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలాగే, నిన్న విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేయడం పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనలో ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ నాయుడుతో పాటు పలువురు నాయకులు గాయపడిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.