News11th Dec 11:21 AMSunil Byrisetty1 min read

రాజధాని రైతు సమస్యల కోసం పోర్టల్

రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఇకపై ప్రతి రోజూ రైతుల నుంచి అర్జీలు స్వీకరించే వ్యవస్థను ఏ

రాజధాని రైతు సమస్యల కోసం పోర్టల్
రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఇకపై ప్రతి రోజూ రైతుల నుంచి అర్జీలు స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజధాని రైతులు, రైతు కూలీలు, స్థానికులు..తమ సమస్యల పరిష్కారానికై అర్జీలను రాయపూడి సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసెప్షన్ కౌంటర్ వద్ద కార్యాలయ పనిదినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వవ వచ్చు అని కమిషనర్ కన్నబాబు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌‌లో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో సైతం https://parishkaram.apcrda.org/(పరిష్కారం పోర్టల్) ద్వారా రైతులు తమ అర్జీలను నమోదు చేయవచ్చని తెలిపారు.
AP Government
AP CRDA
Amaravati Farmers
Capital Region
Farmers Issues
Application Portal
Parishkaram Portal
రైతు అర్జీలు
అమరావతి రాజధాని
రైతు కూలీలు
స్థానికుల సమస్యలు
Scroll for the next article