News15th Jul 10:16 AMSunil Byrisetty1 min read
ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10న ఆయన భుజానికి సర్జరీ చేయించుకున్నారు. 4 రోజుల విశ్రాంతి అనంతరం ఇంటిక
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10న ఆయన భుజానికి సర్జరీ చేయించుకున్నారు. 4 రోజుల విశ్రాంతి అనంతరం ఇంటికి చేరుకున్నారు. తీవ్ర భుజాల నొప్పితో పవన్ బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకేసారి రెండు భుజాలకు చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో తొలుత ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.