News19th Apr 08:50 AMSunil Byrisetty1 min read

రంగంలోకి పవన్.. కూటమి నేతలకు సెగ!

రాష్ట్రంలో భూ బాధితుల కోసం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. భూ బాధితులకు సంబంధించిన ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. అధికారులతో నిర్వహించ

రంగంలోకి పవన్.. కూటమి నేతలకు సెగ!
రాష్ట్రంలో భూ బాధితుల కోసం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. భూ బాధితులకు సంబంధించిన ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈమేరకు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఇబ్బందిపెడితే కూటమి నేతలనూ ఉపేక్షించనని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రం నలుమూలల నుంచి భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కబ్జాలు చేసింది ఏ పార్టీవారైనా ఊరుకోబోనని స్పష్టం చేశారు పవన్.
Andhra Pradesh
Deputy CM Pawan Kalyan
Land Scam Complaints
భూ సమస్యలపై పవన్ కసరత్తులు
భూ కబ్జాలు
Scroll for the next article