News25th May 09:44 AMSunil Byrisetty1 min read
సినీ పరిశ్రమపై పవన్ ఫైర్!
ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ సెటైర్ వేశారు. రాబోయే ర
ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
టాలీవుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ సెటైర్ వేశారు.
రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం ఎలా ఉంటుందో హెచ్చరించారు.
దీనిపై నిర్మాతల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా రిలీజులు ఉంటే తనను వ్యక్తిగతంగా కలిసి, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు తెచ్చుకోవడమే కానీ ఎలాంటి స్పందన లేదని, ఇకపై ఏవైనా అలా కుదరదని తేల్చి చెప్పారు. ఇకపై ఏదైనా అసోసియేషన్ల ద్వారా మాత్రం సంప్రదింపులు చేయాలని చెప్పేశారు