News10th May 12:12 PMSunil Byrisetty1 min read
వీరజవాన్లకు సంఘీభావంగా స్పీకర్ అయ్యన్న అడుగు!
పాక్‌పై ఉగ్ర పోరుకు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ముందుకొస్తున్నారు. పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ స్పందించారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్యసాహసా
పాక్‌పై ఉగ్ర పోరుకు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ముందుకొస్తున్నారు.
పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.
తాజాగా ఏపీ స్పీకర్ స్పందించారు.
ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు సంఘీభావంగా, ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.
దేశభక్తి గల ప్రతీ పౌరుడు ఈ సేవాకార్యంలో భాగస్వామి కావాలని కోరుతున్నానని చెప్పారు.