News17th Mar 12:23 PMSunil Byrisetty1 min read
ఫోన్ సైలెంట్లో పెట్టరా? ట్రిపుల్ ఆర్ సీరియస్!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సీరియస్ అయ్యారు.
అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అందరూ పాటించాల్సిందేనని ఆదేశించారు.
సభ్యులందరూ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోవాలన్నారు. విజ్ఞప్తులు ఒకట్రెండు సార్లు మాత్రమే ఉంటాయని కుండ బద్దలు కొట్టారు.
అనంతరం ఇక చర్యలేనన్నట్లు పరోక్షంగా హెచ్చరించారు ట్రిపుల్ ఆర్. ఈ సందర్భంగా అసెంబ్లీలో జామర్లు పెట్టొచ్చని ఎమ్మెల్యే జోగేశ్వరరావు సూచించారు. మన బలహీనతలను జామర్లపైకి నెట్టొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ మరోసారి స్పష్టం చేశారు.