News1st Apr 09:03 AMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో 51 కరువు ప్రభావిత మండలాలు
ఏపీలోని 6 జిల్లాల్లో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించినట్లు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరాలు వెల్లడించారు.
ఏపీలోని 6 జిల్లాల్లో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించినట్లు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ప్రకటించారు.
ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరాలు వెల్లడించారు.
ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించింది.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు.
డ్రౌట్ మేనేజ్మెంట్ మాన్యువల్ ప్రకారం, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు
ప్రభుత్వం వేసవి తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని, అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సిసోడియా వెల్లడించారు.