Education31st May 04:31 PMSunil Byrisetty1 min read

వాట్సాప్లో డీఎస్సీ హాల్ టికెట్లు!

మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసినట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. cse.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈసారి వినూత్న రీతిలో వాట్సాప

వాట్సాప్లో డీఎస్సీ హాల్ టికెట్లు!
మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసినట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. cse.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈసారి వినూత్న రీతిలో వాట్సాప్ లోనూ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 9552300009 నెంబర్ కు మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల తమ నిబద్ధత నెరవేరిందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.
Andhra Pradesh news
nara lokesh
education
hall tickets download
whatsapp mana mitra
వాట్సాప్లో డీఎస్సీ హాల్ టికెట్లు
హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేష్
Scroll for the next article