Notifications5th Jul 03:33 PMSunil Byrisetty1 min read
ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 16,347 టీచర్ పోస్టులకు పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 16,347 టీచర్ పోస్టులకు పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని ఆదేశించారు.