Notifications28th May 02:12 PMSunil Byrisetty1 min read

డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల నేడే?

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు జూన్‌ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థు

డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల నేడే?
ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు జూన్‌ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అయితే.. పోస్టుల వారీ ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ఈరోజు (మే 27) విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ఇటీవల ఏపీ డీఎస్సీ మాక్‌ టెస్ట్‌లు కూడా వచ్చేశాయి. జూన్ 6 నుంచి జులై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు మాక్‌ టెస్ట్‌లు, హాల్‌టికెట్లు, ఎగ్జామ్‌ షెడ్యూల్‌ వంటి వాటిని అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
Andhra Pardeash
AP Mega DSC 2025
Exam
halltickets
ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు జూన్‌ 6వ తేదీ
విద్యార్థులు మాక్‌ టెస్ట్‌లు
Scroll for the next article