Education16th Jul 04:28 PMSunil Byrisetty1 min read

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ రిలీజ్‌

ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలవ్వడంతో ఇక అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ మేరకు తొలి విడత ప్రవేశాలకు గానూ నేడు (బుధవారం) కౌన్సెలింగ్‌ షెడ్యూ

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ రిలీజ్‌
ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలవ్వడంతో ఇక అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ మేరకు తొలి విడత ప్రవేశాలకు గానూ నేడు (బుధవారం) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం, జులై 20 నుంచి 29 వరకు మొత్తం పది రోజుల పాటు రిజిస్ట్రేషన్‌, ఫీ పేమెంట్‌ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ జులై 22 నుంచి 31వరకు చేపట్టనున్నారు. జులై 25 నుంచి 31 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 1న వెబ్‌ ఆప్షన్లు మార్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో సెల్ఫ్‌ జాయినింగ్‌/ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
AP EAPCET
AP EAPCET Counselling
APSCHE
Andhra Pradesh
Engineering Admissions
Pharmacy Admissions
Counselling Schedule
Web Options
Seat Allotment
College Admissions
Scroll for the next article