Jobs5th Jul 12:17 PMSunil Byrisetty1 min read
సచివాలయ ఉద్యోగుల బదిలీలు గడువు తేదీ పొడిగింపు
రాష్ట్రంలో గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జూన్ 30 లోపు పూర్తి చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి
రాష్ట్రంలో గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జూన్ 30 లోపు పూర్తి చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ జూలై మొదటి వారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందున గడువును పెంచాలని నిర్ణయించింది. తాజాగా ఈ గడువును జూలై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.